తంగిరాల సోని – బ్లాక్ వాయిస్
నేను చాలా పుస్తకాలు చదివిను కానీ చాలా రోజుల తర్వాత నన్ను ఆకట్టుకున్న పుస్తకం తంగిరాల సోని కవిత్వం బ్లాక్ వాయిస్ చాలా చాలా బాగుంది ఈ రోజుల్లో కవిత్వం రాయాలంటే ద్వందార్థాలు మరియు పర్యాయపదాలు గానో నానార్ధాలు గానో అర్థం చేసుకోవలసి వస్తుంది కానీ ఈ కవిత్వం ఇప్పుడున్న వాడుక భాషలో చెప్పాలంటే చదువురాని వారికే త్వరగా అర్థమవుతుందని చెప్పవచ్చు. దీనిని మోటు కవిత్వం అని కూడా అనవచ్చు. ఇప్పటి కవులు చాలా కవిత్వాలలో తనదైన భాష, శైలి, అర్థం తమకు అనుగుణంగా రాసుకుంటున్నారే తప్ప ఇతరులకు త్వరగా అర్థమయ్యే రీతిలో ఎవరూ రాయడం లేదునిపిస్తుంది. బ్లాక్ వాయిస్ కవిత్వం అలా కాదు ఎవరు చదివినా సరాసరి ఆకట్టుకున్న శైలిలోనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కవిత్వం చదువుతున్నంత సేపూ ఈ పదాలు మనం రోజు మాట్లాడుకునే మాటలే కదా అనుకున్న ఆ పదాలు రాయడానికి ఒక్కసారిగా ఎవరికి ఆలోచన తట్టదు. ఒక్క తంగిరాల సోని గారికి తప్ప. ఈ బ్లాక్ వాయిస్ కవిత్వం సరదా కోసమో, పుస్తకాలు ముద్రించుకోవడం కోసమో, అవార్డుల కోసమో - పురస్కారాల కోసమో కాదు . దేశంలో జరిగే అరాచకాలపై అందులో దళితులపై జరిగే దాడులపై తంగిరాల సోనీ తమ కవిత్వాన్ని తిరుగుబాటు తత్వం ఉండేలా ఒక సంకేతాన్ని బ్లాక్ వాయిస్ రూపంలో ఎగర వేసాడు. దళితులపై ఎక్కడైనా దాడులు జరిగినా వెంటనే స్పందించి ఆ సంఘటనకు వెళ్లడం వెంటనే కవిత్వరూపంలో సోషల్ మీడియాలో పంపడం జరుగుతుంది కానీ, ఎక్కడైనా ఏసంఘటనలు జరిగినా మనకు ఎందుకులే అనేవాళ్లే చాలా మంది ఎక్కువ. కానీ సోనీ మాత్రం తన వాయిస్ ని వినిపిస్తాడు. అతనిలో గొప్ప విషయం ఏమిటంటే వయసులో చిన్నవాడైనా పెద్దవాళ్లకు ధైర్యం చెప్పే వ్యక్తి. అందులో స్త్రీలపై జరిగే అన్యాయాలపై ఎక్కువగా స్పందించి తన బ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారా ప్రశ్నించే తీరు, ఎదుర్కొనే తీరు, తిరుగుబాటుచేసే తీరు, సరికొత్త గొంతుతో వినిపిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఈ బ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారా అర్థమవుతుంది.
తల్లిదండ్రులు భారంగా భావించే పిల్లలు ప్రస్తుత రోజుల్లో చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం . వయసుమళ్ళిన తల్లిదండ్రులను ప్రేమగా జీవితాన్ని కొనసాగించడానికి తమ పిల్లలు ముందుకు రాక పోవడానికి కారణం ప్రేమ నశించడమే. తల్లి పనిచేసే శక్తి ఉంటే అన్ని పనులు చేయించుకుని ఒక ముద్ద భోజనం పెట్టి తన పనేదో తనను చూసుకోమనేవారు ఒకప్పుడు ఉన్న ఇప్పుడు కనుమరుగవుతున్నారు. తల్లి తన బిడ్డలను ఎలా చూసుకునేదో అమ్మ ఒంటరి కవిత్వం ద్వారా మనకు చక్కని సందేశం ఇస్తున్నారు సోనీ. సమాజంలో ఆడపిల్లల పుడుతుంటే సంతోషపడాలి కానీ బాధపడకూడదు. ఇందులో ఆడపిల్ల నేను పుట్టగానే నన్ను భారంగా చూడలేదు కానీ నేను పుట్టిన తర్వాత నాన్నచనిపోయాడని నన్ను అవమాన పరిచారు మా ఊరి ప్రజలు. అమ్మ ఎంత బాధ పడిందో నాకు తెలుసు నా చిన్నప్పుడు పందిరి గుంజకు ముతక చీర ఊయలగా కట్టి దానిలో పడుకోబెట్టి పరిగేరుకోవడానికి పొలం పోయేది. వస్తూ వస్తూ పరిగి గింజల్ని కోమట్ల కొట్టంలో వేసి చీరలో సోలెడు బియ్యం, రెండు ఉల్లిపాయలు, రెండు మిరపకాయలు, తీసుకుని గబగబా వస్తూ తలకు కట్టిన గుడను బిగదీసుకుంటూ వస్తుంటే వాడ మలుపు లోనే నా ఏడుపు గొంతు వినిపించి గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంటే పక్కన ఉన్నవాళ్లు మీ పిల్ల దయ్యం పిల్ల ఆ గొంతుచూడు ఎలాఉందో ఊరు మొత్తం వినిపిస్తుంది ఆమెకు లేనిపోని చాడీలు చెబుతుండేవాళ్ళు. తల్లి తన బిడ్డను కళ్ళు తుడుస్తూ, తల నిమురుతూ, చీముడు తుడుస్తూ అలా ఆలోచించే అమ్మ అబిడ్డ ఎదిగేకొద్దీ అమ్మ అలా తగ్గుతూ ఉండేది అమ్మను వాటేసుకుని పడుకుంటే అమ్మ పేగులో సముద్రాల అలలు పోటెత్తిన శబ్దాలు వినిపించాయి నాకు. మూడు పూటలు అన్నం పెట్టి, అమ్మ కుంటల్లో నీళ్లు తాగి ఆకలని నింపుకునేది . “ నేను ఎదుగుతుంటే / అమ్మకు గుండెల్లో కలుక్కుమన్నట్టు వుండేది / నా సమర్తకు రైక ముక్కయినా / కొనలేని అమ్మ / నేను బువ్వ తినందే తినని మా అమ్మ / నన్ను సూడకుండా ఉండలేని అమ్మ / ఇప్పుడు నాకు వయస్సు వొచ్చిందని / ఎవళ్ళనో నాకు కట్టబెట్టడానికి వెతుకుతుంది / కిందా మీదా పడి నాకు పెళ్లి చేసి / ఇప్పుడు నన్ను పంపేటప్పుడు / తన రెండు చేతులతో పాటు / అమ్మ ప్రాణాన్నే నేను తీసుకెళ్తునట్టుంది / అమ్మ నుండి నన్ను దూరం చేస్తుంటే / నాకు అమ్మే కావాలి అనిపించి / గుక్క పట్టి ఏడ్చుకుంటూ వచ్చా / నేను లేకుండా నా పిచ్చితల్లి / యట్టా బతికిద్దో / నాకు తెల్వడంలా / ఇప్పుడు అమ్మ ఒంటరి.... ఇలా తల్లీ పిల్లల మధ్య చాలా సంఘటనలు మనము గుర్తు చేసుకోవచ్చు.
చాలామంది కవులు స్త్రీల అందాలను అణువణువు వర్ణించారే తప్ప! బాధలను ఎవరు వర్ణించలేదని దేశంలో స్త్రీలపై జరిగే సంఘటనలు బాదా తప్త హృదయంతో కలాలు కదిలించాలని తంగిరాల సోనీ బ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారా తెలియజేశారు. నా నెత్తురుతో అనే కవితలో ఓ స్త్రీ ఆవేదనతో నాఅందాలు వర్ణించడానికి, ప్రతి అవయవాలు కొలవడానికి , మమ్మల్ని ఏవిధంగా చిత్రహింసలు పెట్టారో, ఎలా రేప్ చేశారో రాయడానికి మాత్రమే మీ కలాలు కదులుతాయి గాని, మా బాధలు మా రోదనలు రాయడానికి మీ కలాలకు కుష్టురోగం వచ్చింది కదా ! మేము సమాజంలో రావాలి అంటే భయం, జీవించాలంటే భయం ఎక్కడ చూసినా మనుషుల్లో మానవత్వం చచ్చి , మృగం ఆవహించి పశువుల ప్రవర్తిస్తున్నారు. అదేమంటే ఇది చేసే పనికి అలాగే జరగాలని వేదమంత్రంలా పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ సరదాగా నా పై జోకులు వేసుకుంటూ అనరానీ మాటలతో చచ్చిన తర్వాత కూడా ఇది ఇలా అది అలా ఈ మాటల పోటులతో మమ్మల్ని చంపుతుంటారని, నానెత్తురుతో అనే కవితలో బాధను వ్యక్తం చేస్తూ.... “ నా దేహంపై కప్పుకున్న గుడ్డని తీసి / నాపై పొర్లడడానికే కలాలు కదులుతాయి.../ బయట మాత్రం మేం స్త్రీ వాదులం / అని చెప్పే గొప్ప హింసావాదులు ఉన్న / పరమ కిరాతక పురుషులోకం.../ కప్పుకోండి... కప్పుకోండి...కప్పుకోండి... / నా శరీరం తోలు వొలిచి తయారు చేసిన / వజ్రాల శాలువాతో సత్కరించుకోండి / నా రొమ్ములు కొరికి సిరా నింపిన / కలాలు తీసుకోండి / నన్ను చంపి బంగారంతో తయారుచేసిన / పతకాల సర్టిఫికెట్లు అందుకోండి.../ మీక్కావాల్సింది నా పతనమే కదా / మీక్కావలసింది నా బానిసత్వమే కదా / మీక్కావలసింది నాపై పెత్తనమే కదా / మీక్కావాల్సింది నా శరీరమే కదా / ఒరే.. ఒరే.. ఒరే... / తలతిప్పితేనే వరసకట్టి / హింసించే పరమ దుర్మార్గులారా / మీ ఇళ్లల్లో కూడా నేను ఉంటానని / మీరు కూడా నా నుండే వచ్చారని తెలుసుకోండి... ఇలా దేశంలో జరుగుతున్న దాడులకు నిరసనగా తంగిరాల సోనీ నా నెత్తురుతో అనే కవితలో స్త్రీ ల బాధలను వ్యక్తం చేశారు.
ఒకప్పుడు మనం కట్టేలతోనే భోజనం వండుకునే వాళ్ళం . రాను రాను గ్యాస్ - కరెంటుతో అలవాటైపోయింది మనకి. చెప్పాలంటే రోగాలు కూడా దగ్గర అయ్యామే తప్ప మళ్లీ కట్టెలతో వండటం లేదు. పల్లెల్లో ఎక్కువ శాతం తల్లిదండ్రులు కలిసి వరిచేలల్లో పనికి వెళ్లి పనిచేసి వస్తూ వస్తూ కొన్ని కట్టెలు తీసుకుని వస్తూ ఉంటారు . ఆకట్టేలు పచ్చివైనా, ఎండివైనా వీటితోనే వంట చేసేవారు . కట్టెలతో వండుకున్న భోజనం తింటే ఎలాంటి రోగాలకు దరిచేరనీయకుండా గ్యాస్ కు దూరంగా ఉంచుతాయి. పల్లెల్లో కట్టెలమోపు తీసుకువస్తున్నారంటే ఎక్కువమంది స్త్రీలే . అమ్మ కట్టెలమోపు తీసుకు వస్తూ వస్తూ ఈ కట్టెలమోపు అనే కవితలో అమ్మ చేసే పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువేననిపిస్తుంది ... “ పొద్దున్నే పరగడుపున నీళ్లు తాగి / తలకు కట్టుకోవల్సిన తువ్వాలు ఒకటి తీసుకుని / చేతిలో కొడవలి పట్టుకుని / గబగబా ఇంటి తాడిక నెట్టి ) అందర్నీ లేపుకుని / పుల్లలు ఏరడానికి పోయేది అమ్మ.../ కంది కట్టే, పొగాకు కట్టే, పత్తి కట్టే / నెత్తిమీద మోస్తావుంటే / అంత బరువు యట్టా మోస్తున్నావే / అనీ.. ఊరిలో జనం నోరు ఎళ్ళబెట్టే వాళ్ళు / అమ్మ ఇంటి చుట్టూరా / తడిక కట్టిందంటే / ' ఎంత అందంగా కట్టివే ' అనీ / చుట్టు పక్కల వాళ్లు మురిసేటోలు.../ పరగడుపునే పుల్లలకు పోయీ / వస్తా వస్తా చీరచెంగులో రేగు పళ్ళు తెచ్చేది / నోట్లో వేపపుల్ల పెట్టుకుని / ఆకలని ఎండగడుతూ ఉండేది అమ్మ/ రాత్రుళ్లు సగం బువ్వతోనే / చెయ్య కడిగే మా అమ్మ / పొద్దున్నే మంచినీళ్ళు తోనే కడుపు నింపుకునేది / వారంలో ఒక్కసారి అయినా సరిగ్గా / బువ్వతిందో లేదో కానీ.../ పనికి వంగిందంటే / యంత్రమైన వంగి దండం పెట్టాల్సిందే అమ్మకు... ఇలా అమ్మ పనితనం గురించి చక్కని సందేశం తన కవిత్వం ద్వారా తెలియజేశారు సోనీ గారు.
ప్రాచీన కాలం నుంచి వస్తున్న మాట అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ చేసే పనులు గురించి, త్యాగాలు గురించి ఎంత చెప్పినా తక్కువేననిపిస్తుంది. నడక, నేర్పరి, శైలి , భాష అన్ని మొదటిగా అమ్మ దగ్గరేనేర్చుకుంటాము. కవిత్వాలు, నవలలు, కథలు మొదలగునవి ఏవైనా అమ్మ గురించే ఎక్కువగా రాస్తుంటారు రచయితలు . అలాంటి అమ్మ గురించి ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే అమ్మ విలువ తెలిసిన వారికి ఎవరికైనా కోపం వస్తుంది. అమ్మ గురించి చులకనగా మాట్లాడినా , దూషించినా బిడ్డలు తిరగబడతారు లేదో తెలియదుగానీ కచ్చితంగా తల్లి తిరగబడాలి అని సోనీ గారు చెప్పే అమ్మ కవిత్వంలో... పొడిచే పొద్దు కన్నా అమ్మ ముందే లేచి ఇల్లు వాకిలి ఊడ్చి పేడ నీళ్లు చల్లి చట్టేలో గిద్దెడు బియ్యం పోసి కట్టె పొయ్యలో ఉడుకుతుండగా బయట దొరగారి పిలుపుకి కాలిన సాసరను పక్కన పెట్టి ఏందయ్యగారు పిలిచారు అనేలోపే దొరసాని ఇంట్లోంచి అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. ఇంకా రాలేదేమిటా అని నీకోసం ఎదురు చూస్తున్నా ఇంట్లో పనంతా చేసి ఆ చద్దికూడు తీసుకొని వెళ్ళు అని చెప్పి దొరసాని మళ్ళీ పడుకుంది. పనంత చేసేసరికి సాయంత్రం అయింది. పని చేసి వస్తూ వస్తూ కొంతమంది దారిలో అరుగులమీద దొరలు పంచలు సర్దుకుంటూ, పళ్ళు నూరుతూ , కండ్లు కొడుతూ, రొమ్ము ఇరుస్తూ, పళ్ళు పెదాల మీద కొరుకుతూ... “ ఏందే..! / నీ మొగుడు సచ్చాక .. / చాలా వొళ్ళు చేశావంటూ / సరసాల మాటలు మాట్లాడుతున్నారు../ కాగుతున్న నూనెలో ఎయ్యాలి / ఈ దొరగాండ్లను అంటూ / తల దించుకొని నడుస్తుంది అమ్మ.../ ఆకలితో పేగులు మాడిన డొక్కలో / వాడికి సౌందర్యం కనబడిందంట...! / అలసి సొలసి పనులతో నిద్రలేమి నా కళ్ళల్లో / కామపు చూపులు కనపడిందంట / పాలురాని నా రొమ్ములో / వాడికి నయాగరా జలపాతాలు కనపడ్డాయంట..!/ ఈ.. దొరగాండ్లకు.../ ఒక్కపూట బువ్వ లేకపోతే..! బతకలేని వెధవలు../ దొరసాని ముందుకెళ్తే../ దొరగారు కుక్క పిల్లలా, కుక్కిన పేనులా పడుండాలి.../ బయట రోషంలేని మీసం మెలేస్తారు / గాంభీర్యం ప్రదర్శిస్తారు... అంటూ నా మొగుడు ఇంటా మగాడే బయట మగాడే మా ఆయనకి దేనికి చాలరు ఈ దొర గాండ్లు . మా ఆయన పొలం పనికి పోతే పని చిటికలో అయిపోతాది. మా ఆయన పని చేసి బయటకు వస్తుంటే ఈ దొరగాండ్లు రెండు చేతులు తీసుకువెళ్లి రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని కూర్చుని భయపడుతూ తలదించుకుని చూస్తుంటారు . నా మగాడు పేరు చెబితే మీకు పంచెలు తడవాలా అంటూ ... ఏడుస్తున్న పిల్లాడ్ని ఎత్తుకొని ముద్దాడుకుంటూ.. గుమ్మంలో కూలబడి తన రొమ్ములో రాని పాలు ఇస్తూ బిడ్డలో వాళ్ళయ్యను చూసుకుంటూ మురిసిపోతోంది అమ్మ...!
తంగిరాల సోనీ గారు దేశంలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు గద్గద స్వరంతో వినిపించిన బ్లాక్ వాయిస్ కవిత్వంలో ఎక్కువ శాతం స్త్రీవాద కవిత్వమే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ప్రతి స్త్రీలో మన ఇంట్లో స్త్రీలతో సమానంగా చూడాలని సరికొత్త గొంతుతో స్త్రీవాద భావజాలాన్ని ఈ సమాజం అందిపుచ్చుకోవాలని స్త్రీలపై జరిగే దాడులలో గృహహింస, హత్యాయత్నం , చులకన భావన, బానిసత్వం నీటి నుండి స్వేచ్ఛగా ప్రజలకు తమకు తాము నచ్చే విధంగా నడుచుకోవాలని, ఇంటి పనికి , వంట పనికి పరిమితమైన స్త్రీలు స్వేచ్ఛ సమాజంలోకి అడుగుపెట్టడానికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా స్వాతంత్య్రం లో స్త్రీలకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రూపొందించిందని తంగిరాల సోని కవిత్వం బ్లాక్ వాయిస్ ద్వారా వినిపించారు.
దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534

No comments:
Post a Comment