విప్లవ సాహిత్య సృష్టి - కలేకూరి ప్రసాద్
జ్యోతి రావు బాపూలే, పెరియార్, అంబేడ్కర్ భావజాలంతో పాటు, మార్క్సిజం ప్రభావం కూడా దళిత సాహిత్యంలో కనిపిస్తుంది. "దేశీయ మార్స్కిజం' అనే భావన కూడా తెలుగు దళిత సాహిత్యంలో చర్చలోకొచ్చింది. అందువల్ల దళిత సాహిత్యాన్ని కాలం, స్వభావాలను అనుసరించి గుర్తించవలసి ఉంది. అయినా, దళిత సాహిత్యం ఆవిర్భవించటానికి శతాబ్దాల సామాజిక పీడనను ఎదుర్కొన్న చారిత్రక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం నుండే "దళిత సాహిత్యం' స్పష్టమైన అంబేడ్కర్ తాత్త్విక భావజాల భూమికతో ఆవిర్భవించింది
దళిత సాహిత్యం - చారిత్రక నేపథ్యo అపౌరుషేయాలని భావించే వేదాల్లో (ఋగ్వేదం-10వ మండలం పురుష సూక్తం) చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావన కనిపిస్తుంది. దాని ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ సాంఘిక అసమానతలకు కారణమయ్యింది. కులం వల్ల కలిగిన జ్యోతి బాపూలే నిమ్నజాతుల ఉద్ధరణ కోసం "సత్య శోధక సమాజం' (1873) స్థాపించారు. పూలే హిందూమతంలోని లోపాలను వివరిస్తూ అనేక పుస్తకాలను రాశారు. 1910లో కలకత్తా కాంగ్రెస్ సమావేశం అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. 1918లో అఖిలభారత దళితజాతుల సమావేశాలు బొంబాయిలో జరిగాయి. 1924లో డా.బి.ఆర్. అంబేడ్కర్ అస్పృశ్యత నివారణోద్యమాన్ని ప్రారంభించారు.ఈ ప్రభావం భారత దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బలంగానే కనిపించి, దళిత ఉద్యమాలు ఊపందుకున్నాయి. తెలుగువారికీ ఈ ఉద్యమాలు మార్గదర్శకమయ్యాయి. 1967 నాటికి జ్యోతిబా పూలే, సాహూ మహారాజ్, [కారల్ మార్క్స్] సిద్ధాంతాలు నీగ్రో సాహిత్యంలోని తిరుగుబాటు కలగలిసి అంబేడ్కర్ భావజాలాన్ని ప్రధానంగా చేసుకొని "దళిత సాహిత్యం' ఆవిర్భవించింది.
1981లో భారతీయ దళిత సమాచార పత్రికా సంపాదకుల సదస్సు జరిగింది. 1984లో భారతీయ దళిత సాహిత్య అకాడమీనీ స్థాపించారు. కాన్షీరామ్ 1984 నాటికి అంబేడ్కర్ భావజాలంతో బహుజన సమాజ్ పార్టీని స్థాపించారు. దీనితో రాజకీయంగా కూడా దళితులలో చైతన్యం వెల్లువెత్తింది. ఈ ప్రభావం కూడా తెలుగు సాహిత్యంపై కనిపించింది.
1968లో కంచకచర్లలో కోటేశుని సజీవ దహనం చేయడం, 1985 జూలై 17న కారంచేడు ప్రాంతంలో దళితులపై మారణకాండ సాగించడం వంటి సంఘటనలు జరిగాయి. 1990 ఆగస్టు 6న చుండూరులో దళితులను ఊచకోత కోశారు. దీనితో అంతవరకు సంస్కరణోద్యమ, అభ్యుదయ, విప్లవ సాహిత్యం రాస్తున్న తెలుగు రచయితలు, కవులు దళిత సాహిత్యం పై దృష్టిని కేంద్రీకరించారు.అభ్యుదయ సాహిత్యం పీడిత శ్రామిక వర్గ సమస్యలలో భాగంగానే దళిత సమస్యలకు పరిష్కారాన్ని సూచించింది. అది ఎక్కువగా ఆర్థిక సంస్కరణలకే ప్రాధాన్యాన్నిచ్చింది. విప్లవ సాహిత్యం గిరిజన సమస్యలతో పాటు దళిత సమస్యలను వర్గ దృష్టితో ప్రత్యేక ప్రాధాన్యాన్నిచ్చింది. ఆర్థిక కోణానికి అధిక ప్రాధాన్యాన్నిచ్చే విప్లవ స్పృహతో సమాంతరంగా సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడా దళిత చైతన్యం విస్తరించింది. వర్గం కంటే దళిత సమస్య "కులం' తోనే ముడిపడి ఉందని గుర్తించి, ఆ అంశాలను ప్రధానంగా తీసుకొచ్చింది.
1909లో ఒక కుసుమ ధర్మన్నకవి రాసిన ""మాలవాండ్ర పాటను తొలి దళిత గేయంగా పరిశోధకులు భావించారు. ఇది ఆంధ్రభారతి (బాధ్రపద) మాసపత్రికలో అచ్చయ్యింది. ఆ తరువాత గురజాడ అప్పారావు 1911లో కుల సమస్యను స్పర్శిస్తూ ముత్యాలసరాల్లో రాశారు. 1915లో మంగిపూడి వేంకటశర్మ ""నిరుద్ధ భారతం అనే పద్య కావ్యాన్ని రాశారు. అస్పృశ్యతను నిరసిస్తూ దళితేతరులు రాసిన తొలి పద్యకావ్యంగా దీన్ని విమర్శకులు భావిస్తున్నారు. కొండపల్లి జగన్నాథరావు 1921లో రాసిన ""మేలుకొలుపు గీతం పురాణాల్లో దళితుల గొప్పతనాన్ని కీర్తించే విధంగా ఉంది. 1930లో జాలా రంగస్వామి రాసిన ""అంటరానివాడెవ్వడు పాట, 1933లో కుసుమ ధర్మన్న రాసిన ""హరిజన శతకం దళితుల మనోభావాలను బాగా పట్టుకోగలిగాయి. 1933లోనే కుసుమ ధర్మన్న రాసిన ""మాకొద్దీ నల్ల దొరతనము గేయం ఒక ఊపు ఊపింది.
గుర్రం జాషువా రాసిన ""గబ్బిలం(1941) కావ్యంలో దళితుల వేదనా భరిత జీవితాలను, అప్పుడే మొలకలెత్తుతున్న తిరుగుబాటు స్వభావాన్ని శక్తివంతంగా అభివ్యక్తీకరించారు. ఈయనే రాసిన ""నా కథ దళిత ఆత్మ కథకు ప్రేరణనిచ్చే రచన. బోయి భీమన్న పురాణేతిహాసాల సమగ్ర అవగాహనతో గాంధీ, అంబేడ్కర్ తాత్త్విక భావాల సమ్మేళనంతో గొప్ప రచనలు చేశారు. ""గుడిసెలు కాలిపోతున్నై, ""రాగవాశిష్టం ""పాలేరు వంటివి బోయి భీమన్న రచనలలో ప్రముఖమైనవి. ఈ రచనలు దళితులకు గొప్ప ప్రేరణనిచ్చాయి. ఇలా అస్పృశ్యతను నిరసిస్తూ దళిత, దళితేతరులు అనేక రచనలు చేశారు.
దాదాపుగా ఈ రచనలన్నీ ""జీవితానుభవాలనుంచి పొందిన స్పందన, నిరసన, సంస్కరణ, ఉద్ధరణ, విమర్శ, విజ్ఞాపన, సంఘటన, ప్రతిఘటన దశలుగా పరిణామం చెందాయని విమర్శకులు భావిస్తున్నారు. 1968లో కృష్ణా జిల్లా కంచికచెర్లలో కోటేశు అనే దళితునిపై అగ్రవర్ణాల వారు దొంగతనం కారణాన్ని మోపి అతడిని సజీవ దహనం చేశారు. ఆ తరువాత కారంచేడు ప్రాంతం(17-7-1985)లో దళితులపై జరిగిన మారణకాండతో దళితుల్లో చైతన్యం వెల్లువెత్తింది. అంతకుముందు పదిరికుప్పం ప్రాంతం(5-8-1983)లోనూ కొతమంది దళితులను కిరోషిన్ పోసి కాల్చేశారు. నీరుకొండ ప్రాంతం( 15-7-1987)లోకొంతమంది దళితులను చంపేశారు. చుండూరు ప్రాంతం( 6-8-1991)లోనూ కొంత మంది దళితులను ఊచకోత కోశారు. ఈ నేపథ్యంలో జి. లక్ష్మీ నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్‌ల సంపాదకత్వంలో ""చిక్కనవుతున్న పాట వెలువడింది.ఈ సంకలనంతో దళిత కవిత్వం ఒక సమగ్ర రూపం పొందింది. ఆ తర్వాత ఇంచుమించు ప్రతి సాహిత్య పేజీలోను దళిత సాహిత్యంపై చర్చోపచర్చలు జరిగాయి.
యుగాలు మారినా దళితుల వెతలు మారలేదని చెప్పడానికి, ‘త్రేతా యుగంలో నేను శంభూకున్ని / ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచికచెర్ల కోటేశు' అని అంటున్నారు కలేకూరి ప్రసాద్ గారు.
విప్లవ సంఘంలో పెనుమార్పులు మధ్య ప్రేమ చిగురించి కొన్నాళ్ళ వరకు ప్రణయ ప్రయాణంలో ఆహ్లాదకరమైన జీవితానికి ఒక్కసారిగా పిడుగుపడి హృదయానికి గాయం చేసిన కపట ప్రేమను మరువలేక తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దళిత సైన్యాన్ని ముందుకు నడిపిన విప్లవ యోధుడు కలేకూరి ప్రసాద్ గారు.
కులం మిగిల్చిన అవమానాల గాయాలని తడుముకుంటూ కవిత చెప్పే ఒక దళిత కవి ఈ దేశం నుండి కోరుకుంటున్నది ఏమిటి? తనని మనుస్మృతి సృష్టించిన అస్ప్రుశ్యునిగా కాకుండా, మానవత్వం సృష్టించిన మనిషిగా చూడమని. కవి ‘యువక’ (కలేకూరి ప్రసాద్) మాటల్లో చెప్పాలంటే – ‘పిడికెడు ఆత్మ గౌరవాన్ని’ యివ్వమని.
కలేకూరి ప్రసాద్ రాసిన ఈ ‘పిడికెడు ఆత్మ గౌరవం కోసం’ విస్తృత ఆదరణ పొందిన కవిత. ఈ దేశ చరిత్ర లోను, పురాణాల లోను ఉటంకించిన దళితుల, శూద్రుల ప్రస్తావనని స్పృశిస్తూ కూడా ఎక్కడా ఉపన్యాస చాయలు లేకుండా గొప్ప ఆర్తితో చివరి వరకూ సాగిపోవడం ఈ కవిత ప్రత్యేకత.
కవిత లోని దాదాపు ప్రతీ లైను మనల్ని ఈ దేశ పురాణాల చీకటి మూలల్లోకో, ఈ దేశ చరిత్ర మకిలి అధ్యాయాల్లోకో తీసుకు వెళ్తుంది. ఆ చీకటి మూలల్లోనో, ఆ మకిలి అధ్యాయాల్లోనో దుఃఖించే దళితుల్ని చూపిస్తుంది!
పిడికెడు ఆత్మ గౌరవం కోసం
నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డాను
‘పునరపి మరణం – పునరపి జననం’
నాకు కర్మ సిద్ధాంతం తెలియదు గానీ
మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను
నా దేశం ఈ దేశంలో కరిగిపోయి
గంగా సింధూ మైదానమైంది
నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే
ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి
నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే
ఈ దేశం సస్య శ్యామలమై సిరులు కురిసింది
త్రేతా యుగంలో నేను శంభూకున్ని
ఇరవై ఏళ్ళ క్రితం నా పేరు కంచికచెర్ల కోటేశు
నా జన్మస్థలం కీలవేన్మని కారంచేడు నీరుకొండ
ఇప్పుడు కరుడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం
నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చ బొట్టేసిన పేరు చుండూరు
ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం
ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు – రగిలే రాచ పుండూరు
నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని
తర తరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రున్ని
అవమానాలకూ అత్యాచారాలకూ మాన భంగాలకూ చిత్ర హింసలకూ గురై
పిడికెడు ఆత్మ గౌరవం కోసం తలెత్తిన వాడిని
ధన మదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాడిని
బతికి వున్నందుకు పదే పదే చస్తున్న వాడిని
నన్ను బాదితుడని పిలవకండి
నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి
లోకానికి సంపదను మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన
గరళ కంటున్ని నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
నిటారుగా నిలబెట్టేందుకు
సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని
రగిలే గుండె కొలిమిలో నినాదాలు కురిపిస్తున్న వాడిని
నాకు జాలి జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు
నేను బాదితున్ని కాను అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని
నాకోసం కన్నీరు కార్చకండి – మీకు చాతనైతే
నగరం నడిబొడ్డున ఖననం చేయండి
జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను
ఒక పెను మంటల పెనుగులాటనై
మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను
‘నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ/వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డాను’ అని ప్రారంభించాడు కవితని. నిజమే! ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఎప్పుడు సృష్టించ బడిందన్న ప్రశ్నకు చారిత్రక ఆధారాలు లేవు గానీ, అది వెలుగులోకి వస్తూనే కొందరిని పంచముల పేరిట సమాజానికి అంటరాని వాళ్ళను చేసింది.
భారతీయ సమాజాన్ని కేవలం ఒక వర్గ వ్యవస్థగానే అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన మార్క్సిస్ట్ ఆలోచనా ధోరణిని పక్కన పెట్టి, భారతీయ సమాజాన్ని వర్ణ / కుల వ్యవస్థగానె అర్థం చేసుకోవలసి వుంటుందని చెప్పిన అంబేద్కర్ – పూలే ఆలోచనా ధోరణిని అక్కున చేర్చుకున్నానని చెప్పడం కోసమేనా ‘శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని / నిటారుగా నిలబెట్టేందుకు / సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని’ అని అంటున్నారు?
దేశ మూలవాసులైన దళితులను వెలివాడల లోకి విసిరి వేసిన ఈ దేశ అమానవీయ వర్ణ వ్యవస్థను ధిక్కరిస్తూ ఎగిరిన పతాక ఈ కవిత!
"కర్మభూమిలో పూచిన ఓ పువ్వా..'' గీతంతో ప్రసిద్ధుడైన ప్రజా కవి, దళిత విప్లవ ఉద్యమకారుడు కలేకూరి ప్రసాద్ తొలినాళ్లలో యువక కలంపేరుతో కవిత్వం రాసేవారు.
1964 అక్టోబర్ 25వ తేదీన జన్మించిన కలేకూరి ప్రసాద్ కారంచేడులో దళిత వర్గంపై దాడుల ఘటనతో 'యువక'గా గొంతెత్తారు. ఎనిమిదేళ్లపాటు జననాట్యమండలి, విప్లవ రచయితల సంఘంలో చురుగ్గా పనిచేశారు. పీపుల్స్‌వార్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి, దళిత ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. డర్బన్‌లో జాతి వివక్షపై జరిగిన చారిత్రక అంతర్జాతీయ సదస్సులో కలేకూరి పాల్గొన్నారు.
సుమారుగా ఐదు వందలు పాటలు పైగా ఆయన రాసిన పాటలను కొన్ని పలు చిత్రాలకు ఉపయోగించుకున్నారు. 'కర్మభూమిలో పూచిన ఓ పువ్వా'.. 'భూమికి పచ్చాని రంగేసినట్టూ' 'చిన్ని చిన్ని ఆశలే చిందులేయగా' తదితర గీతాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ఉద్యమ అవసరాల కోసం పలు పత్రికలకు సంపాదకత్వం వహించారు. ఇంగ్లిష్ భాషపై మంచి పట్టున్న ఆయన విదేశీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. స్వామి ధర్మతీర్థ రచించిన 'హిందూ సామ్రాజ్యవాద చరిత్ర' పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చారు. ఆ అనువాదం దాదాపు పది ముద్రణలు పొందింది. అరుంధతీ రాయ్ స్మాల్ ఆఫ్ గాడ్ థింగ్స్‌ను కూడా ఆయన తెలుగులోకి అనువదించారు.
తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి తర్వాత ఆ స్థాయిలో అనువాదాలు చేసిన ఘనత కలేకూరికే దక్కుతుంది. కొంతకాలం సబ్ ఎడిటర్‌గానూ పనిచేశారు. చిలకలూరిపేట బస్సు ఘటనలో ఉరిశిక్ష పడిన చలపతి, విజయవర్ధనం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ విప్లవ దళిత కవి శివసాగర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇటీవలే ఒంగోలులో దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.
“వెలివాడల గుండెల నిండా నిప్పుల నినాదాల్ని వెలిగించి, అంటరాని బతుకుల్లో పిడికెడు ఆత్మగౌరవాన్ని ప్రసరించిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక సమర యోధుడు కలేకూరి ప్రసాద్”.
“భూమి కోసం..అత్యాచారాల నిరోధం కోసం.. గౌరవప్రద జీవితం కోసం..వనరులపైన, రాజ్యాధికార వాటా సాధన కోసం ఒక సమగ్ర దళిత ఉద్మమం రూపొందలేదని ఉద్యమ నాయకత్వాన్ని తన రచనల్లో నిలేసిన కలేకూరి ప్రసాద్”
గుడి లోనికి ‘గబ్బిలం’ రావచ్చు కాని ఈ ‘నాలుగు పడగల హైందవ నాగరాజు ‘ ఒక అంటరాని వాడిని రానివ్వదు. తరతరాల బాధని గుర్రం జాషువా గారు వెలి బుచ్చారు. ఆ బాధ ఇంకా గాధలు గా కొనసాగుతోంది. ఫులే అంబేద్కర్ ల సమాజం లోని ఈ నికృష్ట బ్రాహ్మణా క్రౌర్యాన్ని విరిచినా ఇంకా వెళ్ళు భూమి లో పాతుకు పోయి వున్నాయి. మన చెరబందరాజు అడిగిన ‘ఏ కులం అబ్బి ! నీది ఏ మతం అబ్బి !’ అని ప్రశ్నిస్తూనే వుంది ఈ కరడు కట్టిన కుళ్ళిన బ్రాహ్మణ ఆధిపత్య సమాజం. కనీసం ఇప్పడికి ఐన శ్రీశ్రీ విప్లవ శంఖం లో రాసినట్టు “కులం కులం అని కుశ్చితాలు పెంచుకోకు ! మతం మతం అని మాత్సల్యం తెన్చుకోకు !…” అని సమతా మానవుడు నినదించాలి ..!
ఒకరిది అంటరాని ప్రేమ. మరొకరిది పిడికెడు ఆత్మగౌరవపు ధిక్కార జెండా. పులి చంపిన లేడి కోటేశు అయితే, పులిని వెంటపడి తరిమిన పోట్లగిత్త కలేకూరి.
ఆయనకు టీ కొట్టే మీటింగ్ హాలు. నాపరాయి కుర్చీనే వేదిక. ఇంటి ముందున్న మట్టి దిమ్మె బహిరంగ సభ. వాటిపై అట్లాగే కూర్చుంటాడు. అక్కడికక్కడే కవితలు రాసేస్తాడు. కాదు కాదు రాజేస్తాడు. చుట్టూ చేరిన జనం మధ్యనే వాటిని చదివి వినిపిస్తాడు. తన కవితలు ప్రజా కవితలు ఔనో, కాదో పరీక్షించుకుంటాడు. విప్లవోద్యమ రాతలన్నీ అలానే రాసాడు. దళిత ధిక్కార గానాన్నీ అలానే ఆలపించాడు. తీరా, అవి జనబాహువుల్లో వజ్రాయుధాలై దూసుకుపోతుంటే, శత్రుశిబిరాల్ని తునాతునకలు చేస్తుంటే, గుండె నిండుగా నవ్వుకుంటాడు. మరోమారు గట్టిగా కవితల్ని నెమరువేస్తూ పులకించిపోతాడు. చెరబండరాజు రాసిన ‘నన్నెక్కనివ్వండి బోను’లా, శ్రీశ్రీ రాసిన ‘అర్థనిమిలితానేత్రాల భయంకర బాధల పాటల పల్లవి’లా, గద్దర్ కాలిగజ్జెల ఘీంకారంలా, వంగపండు ‘జముకు చిరుతపులి చిందుల్లా’... కలేకూరి ‘పిడికెడు ఆత్మగౌరవపు’ మాట, ‘భూమికి పచ్చాని రంగేసిన’ పాట జనంలో సజీవ కావ్యాలయ్యాయి. ‘ఎద్దు కొమ్ముల నడుమ ఎర్ర పొద్దు’లయ్యాయి. కలేకూరి రాతల్లో ధిక్కారం తప్ప, లొంగుబాటు కనిపించదు.
కలేకూరి ప్రసాద్ గారు రచించిన కర్మభూమిలో పూచిన ఓ పువ్వా..పాట పూర్తిగా
కర్మ భూమిలో పూసిన ఓపువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా.
కన్నుల ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలో సమిధై పోయావా !!కర్మ !!
పారాణింక ఆరనే లేదు..... తోరణాల కళ వాదనే లేదు!! పారాణింక !!
పెళ్లి పందిరి తియనే లేదు బంధువులింటికి చేరనేలేదు !!పెళ్లి !!
మంగళనాదలాగనె లేదు ..అప్పగింతలు అవ్వనే లేదు!!మంగళ !!
కళ కళ లాడే ఓ సెలయేరా పెళ్లి కూతురుగ ముస్తాబైయ్యి
శ్మశానానికి కాపురామెళ్ళవా !!కర్మ !!
మానవత్వమే మంట కలిశేనా మమతల కర్ధం లేకపోయెనా !!మానవత్వ!!
వేద ఘోష ఎగతాళి చేసేనా ప్రమాణాలు పరిహాసమాడేనా !!వేద !!
ప్రేమ బంధముగా కట్టిన తాళి ఉరితాడైయ్యి కాటువేసేనా !!ప్రేమ !!
పున్నమి రువ్విన వెన్నెలనవ్వా కారు మేఘములు కమ్మేశాయా
చీకటి చితిలో శవానివయ్యవా !!కర్మ !!
ఆడది కన్నా అడవిలో మానుకు విలువిచ్చే ఈ దేశంలోన !!ఆడది !!
ఆరడి పెట్టిన ఆడపడుచుకు అత్తారింట్లో తప్పని స్ధితి ఇది !!ఆరడి !!
బ్రతుకున నిప్పులు పోసిన అత్తకు గర్భశోకము తప్పకున్నది !!బ్రతుకు !!
పిశాచ గణాల ఆనందానికి మారణహోమం జరుగుతున్నది !!పిశాచ !!
లేళ్ళను చంపే పూలుల సీమలొ కోకిల వేదం సాగుతున్నది
జీవనరాగం ఆర్తనాదమాయె !!కర్మ !!
ఎవరోస్తారని ఎదురుచూపులు ఎం చేస్తారని ఈ పడికాపులు !!ఎవరో!!
విషం ఇచ్చిన తగుల బెట్టిన ఉరితాడుకు బిగవేసి చంపిన !!విషం !!
డాక్టరు నీకు సాక్ష్యం రాడు కోర్టులు నీకు రక్షణ రావు !! డాక్టరు!!
చట్టాలన్నీ కోర్టులు అన్ని
నేతి బీరలొ నెయ్యి చందమే
సామాన్యులకు అవి ఎండమావులేగా !!కర్మ !!
అక్కలార ఓ చెల్లెల్లారా వ్యవస్థ మలచిన అబలల్లరా !!అక్క !!
కాలే గుండెల కమురు వాసనకుకన్నులు ఏరులు పారుతున్నవా !!కాలే !!
దారి పొడుగునా శవాల గుట్టలు గుండెల గాయం కెలుకుతున్నవా !!దారి !!
రాక్షస పీడన ఎదిరించాలే స్త్రీలు పురుషులు మనుషులందరూ
సమానమన్న సమాజ ముండాలే
కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా కన్నులు మంకెన పూవులు పూయగ
నెత్తుటి మంటలు కేతన మవ్వగ సమర హోరులో ముందుండాలమ్మా
నువ్వు సమర హోరులో ముందుండాలమ్మా
నువ్వు సమర హోరులో ముందుండాలమ్మా!!కర్మ !!
దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534

No comments:
Post a Comment